అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ పథకం ద్వారా గృహ నిర్మాణాలు చేపడతామని 2008వ సంవత్సరంలో ఒకొక్కరితో రూ.2,100 నగదు తీసుకుని పట్టాలు మంజూరు చేశారు. ఇప్పటి వరకు పట్టాలు ఉన్న భూమిని చూపకుండా అధికారులు, నాయకులు కలిసి పేద ప్రజలను మోసం చేస్తున్నారంటూ సీపీఐ నాయకులు, లబ్థిదారులతో కలిసి పురపాలక కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 25 రోజుల్లో నగదు చెల్లించి లబ్ధిదారులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పురపాలక కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి జాఫర్, నాయకులు చిరంజీవి, రంగయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
8 ఏళ్లు వేచి చూశాం... ఇక మావల్ల కాదు! - ananthapuram district
''8 సంవత్సరాల క్రితం పేద ప్రజలకు స్థలాలు మంజూరు చేస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ.2100 వసూలు చేశారు. ఇప్పటికి మంజూరు కాలేదు. అధికారులు వెంటనే స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలి'' అంటూ సీపీఐ ఆధ్వర్యంలో బాధితులు తాడిపత్రిలో ధర్నా చేశారు.
ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ ధర్నా..