గ్యాస్ ధరలు తగ్గించాలని సీపీఐ వినూత్న నిరసన - కదిరిలో సీపీఐ నాయకుల ధర్నా న్యూస్
వంట గ్యాస్ సిలిండర్ల ధరల పెంపును నిరసిస్తూ కదిరిలో సీపీఐ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. గ్యాస్ సిలిండర్లకు పూలమాలలు వేసి.. వాటిని భుజానికెత్తుకుని ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
వంట గ్యాస్ సిలిండర్ల ధరల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ బండలకు పూలమాలలు వేసి భుజానికెత్తుకుని స్థానిక రాయలసీమ కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో పేదలపై భారం పడుతుందని సీపీఐ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు తగ్గించని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.