ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీవో 22ను వెంటనే రద్దు చేయాలి: సీపీఐ రైతు సంఘం - జీవో నంబరు 22

వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబరు 22ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

cpi farmers association demand to be canceled go no 22
జీవో నంబరు 22ను వెంటనే రద్దు చేయాలి: సీపీఐ రైతు సంఘం

By

Published : Sep 28, 2020, 4:39 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అనంతపురం జిల్లా సీపీఐ రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. అనంతపురంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో రైతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు మీటర్లు పేరుతో అధిక భారం మోపాలని చూస్తున్నారన్నారని ఆరోపించారు.

ఇది హేయమైన చర్యగా జిల్లా సీపీఐ రైతు సంఘం అధ్యక్షులు నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల ఏర్పాటు కోసం తెచ్చిన జీవో నంబరు 22ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details