అనంతపురం జిల్లా హిందూపురం.. తూముకుంట పారిశ్రామికవాడలోని గార్మెంట్ పరిశ్రమలలో కార్మికులు ఆందోళనకు దిగారు. తమకు వేతనాలు పెంచాలంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో.. మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఫ్యాక్టరీ ముందు నిరసనకు బైఠాయించిన సీపీఐ ,సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించగా.. మహిళా కార్మికులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల ఎదుట బైఠాయించారు. పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే యాజమాన్యం వేతనాలు పెంచి బోనస్లు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంటుందని కార్మికులు హెచ్చరించారు.
వేతనాలు పెంచాలని కార్మికులు ఆందోళన - అనంతపురం జిల్లా వార్తలు
హిందూపురం తూముకుంట పారిశ్రామికవాడలోని గార్మెంట్ పరిశ్రమలలో కార్మికులు వేతనాలు పెంచాలని ధర్నా చేపట్టారు. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్రిక్తత నెలకొంది.
![వేతనాలు పెంచాలని కార్మికులు ఆందోళన cpi cpm protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9094059-6-9094059-1602138275225.jpg)
cpi cpm protest