అనంతపురం జిల్లా కదిరి విద్యుత్ కేంద్రం ఎదుట వామపక్ష నాయకులు ధర్నా చేపట్టారు. కష్టకాలంలో ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుతో అదనపు భారాన్ని మోపుతోందని నిరసనకారులు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలను తగ్గించటంతోపాటు, తెల్లరేషన్ కార్డు దారులకు బకాయిలు పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వాపక్షాల ఆందోళన - cpm agitation at kadiri
లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారుల విద్యుత్ బకాయిల రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్ష నాయకులు అనంతపురం జిల్లా కదిరి విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
![విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వాపక్షాల ఆందోళన cpm and cpi agitation at kadiri substation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7245084-788-7245084-1589790037884.jpg)
విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వాపక్షాల ఆందోళన