తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనంతపురం జిల్లా గుంతకల్లులో సీపీఐ కార్యదర్శి జగదీష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా ప్రతిపక్ష నాయకులు, పోలీసులపై ఉక్కుపాదం మోపిన వ్యక్తి ప్రభాకర్‌రెడ్డి అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభాకర్‌రెడ్డి చేసిన అఘాయిత్యాలు అనేకమని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న నాయకులు ఈయన్ను చూసి ప్రతిపక్షాలను గౌరవించేలా మెలగాలన్నారు. అటువంటి పరిస్థితి లేక పోతే అధికారంలో ఉన్నవారు జీవితంలో మనుగడ సాధించడం కష్టతరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సత్ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ప్రభాకర్‌రెడ్డి చేసిన తప్పుకు వైకాపా ప్రభుత్వం ఆయన కుమారుడిని జైలుకు పంపడం అన్యాయమన్నారు. ఈ ఘటన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఒక కనువిప్పు కలుగుతుందని తెలియజేశారు.
'అధికార పార్టీ నాయకులు ఇకనైనా ప్రతిపక్షాన్ని గౌరవించండి' - anantahpuram cpi leader made negative words on prabhakar reddy
అధికారంలో ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అఘాయిత్యాలు అనేకమని గుంతకల్లు సీపీఐ కార్యదర్శి జగదీష్ వ్యాఖ్యానించారు. ఇకకైనా అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్షాలను గౌరవించేలా మెలగాలని... లేని పక్షంలో ఇలాంటి దుస్థితి కలుగుతుందన్నారు. ప్రభాకర్‌రెడ్డి తప్పు చేస్తే ఆయన కుమారుడిని జైలుకు పంపడం సరికాదన్నారు.
!['అధికార పార్టీ నాయకులు ఇకనైనా ప్రతిపక్షాన్ని గౌరవించండి' cpi activist jagadeesh given negative statement on jc family from guntakal town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7647578-231-7647578-1592359283672.jpg)
జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన గుంతకల్లు సీపీఐ కార్యదర్శి జగదీష్
ఇదీ చదవండి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు