సామాన్యంగా అయితే ఆవుకు ఒక ఈతలో ఒకే దూడ జన్మిస్తుంది. అందుకు భిన్నంగా.. అనంతపురం జిల్లాలో గోమాతకు.. ఒకేసారి మూడు దూడలు జన్మించాయి. దీంతో అంతా ఆశ్యర్యానికి గురవుతున్నారు. కొందరైతే త్రిమూర్తులే గోమాతకు పుట్టారంటూ.. పూజలు చేశారు. జిల్లాలోని మడకశిర మండలం చందకచర్ల గ్రామంలో రంగప్ప అనే రైతు గోవులను పోషిస్తూ.. వ్యవసాయం చేసుకుంటున్నాడు. అందులో ఓ ఆవు ఒకే ఈతలో మూడు ఆవు దూడలకు జన్మనిచ్చింది. కాగా ఇది జన్యుపరంగా వచ్ఛే మార్పులని పశు వైద్యులు తెలిపారు.
ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు.. స్థానికుల పూజలు - cow gives birth to three calf's in ananthapur
అనంతపురం జిల్లాలో గోమాతకు.. ఒకేసారి మూడు దూడలు జన్మించాయి. త్రిమూర్తులే గోమాతకు పుట్టారంటూ.. స్థానికులు పూజలు చేశారు. కాగా ఇది జన్యుపరంగా వచ్ఛే మార్పులని పశు వైద్యులు తెలిపారు.
ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు