అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లికి చెందిన చండ్రాయుడు ఆవును పెంచుకుంటున్నాడు. తాను అపురూపంగా చూసుకుంటున్న గోమాతకు గురువారం జన్మదిన వేడుకలు నిర్వహించారు. చిన్నారులను పిలిచి కేక్ కట్ చేశారు. తన ఆరో కుమార్తెగా ఆవును భావించి లక్ష్మీ అని నామకరణం చేశానని యజమాని తెలిపారు. గత నాలుగేళ్లుగా ఏటా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు చండ్రాయుడు చెప్పారు.
అనంతపురంలో ఆవుకు జన్మదిక వేడుకలు..! - cow birthday celebrations
సాధారణంగా పుట్టిన రోజును మనుషులు జరుపుకుంటారు. ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి ఆవుకు జన్మదిన వేడుకలు జరిపి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు.
![అనంతపురంలో ఆవుకు జన్మదిక వేడుకలు..! cow birthday celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5505533-306-5505533-1577413388932.jpg)
అనంతపురంలో అవుకు జన్మదిక వేడుకలు..!!
Last Updated : Dec 27, 2019, 1:04 PM IST
TAGGED:
cow birthday celebrations