అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పడకల కొరతతో కొవిడ్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించినా బెడ్లు దొరకని పరిస్థితి. కొంతమంది కుర్చీలలో కూర్చొని, మరికొందరు నేలపైన పడుకుని వైద్యం అందుకుంటున్నారు. ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న కారణంగా.. రోజురోజుకూ అధిక సంఖ్యలో జనం వస్తున్నారు.
ఒక్కోసారి సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం భౌతిక దూరం పాటించని పరిస్థితి నెలకొంది. పర్యవేక్షకులు కూడా లేని కారణంగా అక్కడకు వచ్చిన వారు భయాందోళనకు గురవుతున్నారు. ఆస్పత్రికి వెళ్తే.. వైరస్ లేనివారికి సైతం అంటుకుంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.