అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొవిడ్ - 19 మొబైల్ టెస్టింగ్ యూనిట్‌ను ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మొబైల్ టెస్టింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనంలో వైద్య సిబ్బందితో పాటు టెస్టింగ్ పరికరాలు అందుబాటులో ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహిస్తారు.
మడకశిరలో కొవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహన యూనిట్ ప్రారంభం - covid testing vehicle lunch in atp
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అనంతపురం జిల్లాలో కొవిడ్ మొబైల్ టెస్టింగ్ వాహనాలను ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రారంభించారు. ఇవి ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు.
మొబైల్ టెస్టింగ్ యూనిట్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తిప్పేస్వామి