పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ... అనంతపురం కొవిడ్ టెస్ట్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రత ఉన్న సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా... సేవలందించామని అన్నారు. సొంత ఖర్చులతో సుదూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. బకాయి పడిన ఆరు నెలల వేతనాలు చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యపై జిల్లా కలెక్టర్ స్పందించి, జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'జీతాలు చెల్లింపులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు'
అనంతపురంలో కరోనా వైద్య సిబ్బంది ఆందోళన చేశారు. ఆరు నెలలుగా జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
అనంతపురంలో కరోనా వైద్య సిబ్బంది ఆందోళన