అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పడకలు లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క కరోనా పరీక్షల కోసం వస్తున్న జనం సర్వర్ పనిచేయకపోవడంతో నిరీక్షించాల్సి వస్తోంది. ఎక్కువ మొత్తంలో జనం రావడంతో భౌతిక దూరం పాటించని పరిస్థితి. దీంతో కరోనా ఉన్న లేకున్నా ఆస్పత్రికి వస్తే కరోనా అంటుకునే పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం సర్వర్ సమస్యను పరిష్కరించి….వెంటనే పరీక్షా ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కరోనా బాధితులు కొంతమంది నేలపైనే నిరీక్షిస్తున్నారు. మరికొంతమంది కుర్చీలలో ఆక్సిజన్ అందుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు పడకలు ఖాళీ అవుతాయా.. తమకు పడక ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూస్తున్నారు.
పడకల్లేక పాట్లు..ఆస్పత్రుల ఎదుట వాహనాల్లో పడిగాపులు! - No beds in Anantapur govt hospital
అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో పడకల్లేక కొవిడ్ బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్ ఎప్పుడు ఖాళీ అవుతుందా..అని ఎదురుచూపులు చూస్తున్నారు. కొంతమంది ఆస్పత్రుల ఎదుట వాహనాల్లో పడిగాపులు కాస్తున్నారు. మరో పక్క కరోనా టెస్ట్ లు కోసం జనం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.
నగర శివారు ప్రాంతం నాగిరెడ్డిపల్లికి చెందిన రామలింగారెడ్డి అనే వృద్ధుడు అస్వస్థతకు గురికావడంతో అంబులెన్స్ కి ఫోన్ చేసిన రాకపోవడంతో ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ కనీసం పడకలు లేకపోవడంతో స్ట్రెక్చర్ పైనే పడుకోబెట్టారు. ఆటోలో నుంచి కిందకు దిగడానికి బంధువులే నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆసుపత్రి పై ప్రత్యేక శ్రద్ధ చూపి సమస్యలను పరిష్కరించాలని కరోనా బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలో నిలిచిన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ!