అనంతపురం జిల్లాలో కరోనా కేసులు ఉద్ధృతి దృష్ట్యా.. అన్ని ప్రభుత్వాసుపత్రులను కొవిడ్ ఆసుపత్రులుగా ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగులకు పడకలు ఖాళీ ఉన్నప్పటికీ.. ఓపీ తీసుకునే సమయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ తీవ్రతతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక కొంత మంది రోగులు అంబులెన్స్‌లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించి చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.
మండుతున్న ఎండలు..కరోనా రోగుల ఇక్కట్లు
మండే ఎండలతో అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ తీసుకునే సమయంలో గంటల తరబడి ఎండలో నిలబడాల్సి వస్తుండటంతో..రోగులు నీరసించిపోతున్నారు.
మండుతున్న ఎండలు..కరోనా రోగుల ఇక్కట్లు