ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ రోగులపై వివక్ష చూపొద్దు : హిందూపురం జేసీ సిరి - hindupuram Covid Hospital latest news

అనంతపురం జిల్లా హిందూపురం కొవిడ్ ఆస్పత్రిలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరోనా మహమ్మారి బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాధితులను ఆరా తీశారు. రోగులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, చికిత్స తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు.

కొవిడ్ బారిన పడితే వివక్ష చూపకూడదు : హిందూపురం జేసీ సిరి
కొవిడ్ బారిన పడితే వివక్ష చూపకూడదు : హిందూపురం జేసీ సిరి

By

Published : Sep 26, 2020, 6:22 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం కొవిడ్ ఆస్పత్రిని జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న వారితో నేరుగా మాట్లాడారు. బాధితులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, చికిత్స విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆత్మస్థైర్యం పెంచేందుకే..

కొవిడ్ మహమ్మారి బారిన పడిన రోగుల పట్ల వివక్ష చూపకూడదని సిరి సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఆత్మస్థైర్యం పెంచేందుకే రోగులతో నేరుగా మాట్లాడినట్లు తెలిపారు. వైరస్ వల్ల దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారిని అనాథలుగా వదిలేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేశారు. సంయుక్త కలెక్టర్ వెంట స్థానిక వైద్య అధికారులు, సిబ్బంది ఉన్నారు.

కొవిడ్ బారిన పడితే వివక్ష చూపకూడదు : హిందూపురం జేసీ సిరి

ఇవీ చూడండి : రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ

ABOUT THE AUTHOR

...view details