కరోనాతో జిల్లాలోని హిందూపురం పట్టణంలో ఓ వ్యక్తి 30 ఏళ్లుగా వ్యాపారం సాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని సొంతూరైన మడకశిరలో అంత్యక్రియలు నిర్వహించడానికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానికులు అతని అంత్యక్రియలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న హిందూపురం కొవిడ్ 19 ప్రత్యేకాధికారి చైతన్యకుమార్...మృతుడి బంధువులకు అండగా నిలిచారు. స్థానికులు నిరాకరించటంతో శిక్షణా ఐఎఫ్ఎస్ అధికారి దగ్గరుండి అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేయించారు.
కరోనాతో మృతి..అంత్యక్రియలకు అండగా నిలిచిన ఐఎఫ్ఎస్ అధికారి - కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు అండగా ఐఎఫ్ఎస్ అధికారి
కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు సొంతూరులో పెరిగిన ఊరిలో అంత్యక్రియలకు స్థానికులు నిరాకరించారు. ప్రజలు నిరాకరించటంతో శిక్షణా ఐఎఫ్ఎస్ అధికారి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.
కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలకు అండగా ఐఎఫ్ఎస్ అధికారి
TAGGED:
అనంతపురంలో కరోనా వార్తలు