అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రోజురోజుకూ కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. నిన్న కొత్తగా 17 పాజిటివ్ కేసులు రావటంతో పట్టణంలో కరోనా కేసుల సంఖ్య 102కి చేరుకుంది. ఇప్పటికి నలుగురు పాజిటివ్‌తో మృతి చెందారు. తాజా కేసుల్లో గతంలో కరోనా సోకిన వారి బంధువులే అధికంగా ఉన్నారు. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. బాధిత కుటుంబాలు హోమ్ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంత మార్కెట్ ను ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ కు తరలించారు.
ఉరవకొండ పట్టణంలో 100 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. నిన్న నమోదైన కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 102కి చేరింది. ఇప్పటికే కరోనాతో నలుగురు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
covid cases in anantapur dst are increasing