ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనంతలో తగ్గుముఖం పట్టిన మహమ్మారి

By

Published : May 21, 2021, 12:44 PM IST

అనంతపురం జిల్లాలో కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఐదు రోజులుగా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. తాజాగా 7,075 మందిని పరీక్షించగా.. 1794 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

covid cases
కరోనా కేసులు

అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గత ఐదు రోజులతో పోలిస్తే పాజిటివిటీ రేటు తక్కువగా నమోదైంది. ఈనెల 16వ తేదీన 45.01 శాతం, తర్వాత రోజు 37.67, మరో రెండు రోజులు 32.07 శాతం చొప్పున పాజిటివిటీ వచ్చింది. గురువారం 25.35 శాతానికి తగ్గడం విశేషం. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన బులెటిన్‌ ప్రకారం జిల్లాలో కొత్తగా 1,794 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. మొత్తం 7,075 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా.. 1794 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటిదాకా బాధితుల సంఖ్య 1,23,243కు చేరింది. 1,10,236 మంది కోలుకున్నారు. 818 మంది మృతి చెందారు. క్రియాశీల కేసులు 12,189 ఉన్నాయి.

4,599 మంది డిశ్ఛార్జి
జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. మూడు రోజులుగా ఈ తరహాలోనే కొనసాగుతోంది. గురువారం 4,599 మంది డిశ్ఛార్జి అయ్యారు. 19న 3,960, 18న 3,685, 17న 2,025 మంది డిశ్ఛార్జి అయ్యారు.

ఎక్కడ ఎన్ని కేసులు
కొత్తగా నమోదైన కేసులను పరిశీలిస్తే.. అనంత నగరంలో 169, గ్రామీణం 91, ధర్మవరం 84, పుట్టపర్తి 69, ఉరవకొండ 51, కళ్యాణదుర్గం గ్రామీణం 47, పట్టణం 46, కూడేరు 42, గోరంట్ల 41, కదిరి 40, బుక్కపట్నం 36, ధర్మవరం గ్రామీణం, హిందూపురం 34 ప్రకారం, ముదిగుబ్బ 31, బత్తలపల్లి, బీకే సముద్రం, హిందూపురం గ్రామీణం, పెద్దవడుగూరు 28 చొప్పున, ఎన్‌పీకుంట 27, అమరాపురం, కనగానపల్లి, మడకశిర గ్రామీణం 26 ప్రకారం, కంబదూరు 25, అమడగూరు, బెళుగుప్ప, కొత్తచెరువు, పెనుకొండ గ్రామీణం 23 చొప్పున, సీకేపల్లి, గుంతకల్లు 22 ప్రకారం, ఆత్మకూరు, శింగనమల 21 చొప్పున, ఓడీసీ, పుట్టపర్తి గ్రామీణం, తాడిమర్రి 20 ప్రకారం, రాయదుర్గం, యాడికి 19 చొప్పున, బ్రహ్మసముద్రం 18, కదిరి గ్రామీణం, యల్లనూరు 17 ప్రకారం, గార్లదిన్నె, లేపాక్షి, నల్లమాడ, శెట్టూరు, వజ్రకరూరు 16 చొప్పున, కణేకల్లు, పెనుకొండ, సోమందేపల్లి, తాడిపత్రి గ్రామీణంలో 15 చొప్పున.. ఇలా 76 ప్రాంతాల్లో కొత్త కేసులు వచ్చాయి.

48 గంటల్లో 8 మంది మృతి
కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో 48 గంటల్లో 8 మంది కరోనాతో మృత్యువాత పడటం కలవరపెడుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు మృతి చెందారని వైద్యులు తెలిపారు. ఎక్కువమంది బాధితులు పరిస్థితి విషమించాకే ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. ఆసుపత్రిలో 89మంది చికిత్స పొందుతున్నారని, 11 నాన్‌ ఆక్సిజన్‌ పడకలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండీ..ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు

ABOUT THE AUTHOR

...view details