అనంతపురంలో సీపీఎం ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం.. ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని మెడికల్ రెప్ సమావేశ భవనంలో.. కొవిడ్ బాధితుల కోసం 20 పడకల కొవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు.
ఇదివరకే దాతల సాయంతో యాభై పడకలతో కేంద్రాన్ని ఏర్పాటు చేసి, కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నామని.. బాధితులు త్వరగా కోలుకుంటున్నారని… అక్కడి సిబ్బంది తెలిపారు.