ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బుక్కపట్నం బాలికల పాఠశాలలో కరోనా కలకలం.. ఆరుగురికి పాజిటివ్ - anantapuram latest news

బుక్కపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థునులు కొవిడ్ బారిన పడ్డారు. అధికారులు.. పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు.

corona in bukkapatnam school
బుక్కపట్నం బాలికల పాఠశాలలో కరోనా కలకలం

By

Published : Apr 15, 2021, 9:48 PM IST

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థునులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్దారణ అయింది.

తోటి విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి గోపాల్ నాయక్ పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మిగిలిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాల మొత్తం శానిటైజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details