ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీడ నుంచి మొక్కలకు రక్షణగా కవర్లు - కురుగుంటలో దానిమ్మ మొక్కల కవర్లు తాజా వార్తలు

చీడనుంచి మొక్కలను కాపాడటానికి వాటి రక్షణగా కవర్లను కప్పి ఉంచారు. అనంతపురం జిల్లా కురుగుంటలో దానిమ్మ తోటలోని మొక్కలకు రైతు కవర్లను ఏర్పాటు చేశారు.

Covers to protect plants from pests at kurugunta
చీడనుంచి మొక్కలకు రక్షణగా కవర్లు

By

Published : Nov 6, 2020, 7:28 AM IST

చీడ, పీడ నివారణతో పాటు మంచు, చలి వల్ల వచ్చే ఫంగస్‌ నుంచి మొక్కలను రక్షించుకునేందుకు అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని కురుగుంటకు చెందిన రైతు రామాంజనేయులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 5 ఎకరాల్లో దానిమ్మ సాగుచేశానని, ప్రస్తుతం కాయలు కాస్తుండటంతో రక్షణ చర్యలు తీసుకున్నానని ఆయన తెలిపారు. కవర్ల కొనుగోలు, రవాణా, కూలీల కోసం ఒక్కో మొక్కకు రూ.120 ఖర్చుచేసినట్లు రైతు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details