ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య మరణాన్ని తట్టుకొలేక.. ఆత్మహత్య చేసుకున్న భర్త - అనంతపురం గ్రామంలో ఆత్మహత్య కేసులు

మేనమాన కుమార్తెను ఇష్టపడ్డాడు. ఆమె అంగీకరించటంతో కన్నవాళ్లు కాదన్న.. కలిసి బతకాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల ముగియక ముందే ఏ కష్టం వచ్చిందో కానీ ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇది తెలుసుకున్న ఆమె భర్త... తను లేని జీవితం నాకేందుకు అనుకున్నాడో ఏమో? పొలంలోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం జరిగింది.

couple suicide
తనలో సగమైన భార్య మరణాన్ని తట్టుకొలేక తనువు చాలించిన భర్త

By

Published : Jan 22, 2021, 9:22 PM IST

భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ప్రీతి, మచ్చింద్రలకు మూడు నెలల క్రితం వివాహమైంది. మేనమామ కూతురైన ప్రీతిని ... తల్లిదండ్రులు కాదన్నా ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. దీంతో ఇరుకుటుంబాల మధ్య చిన్నపాటి తగాదాలు జరుగుతుండేవి. అయితే.. ఈ రోజు ఉదయం ప్రీతి ఆత్మహత్య చేసుకోగా.. అది చూసి తట్టులేక పోయిన మచ్చింద్ర పొలానికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాల ఒత్తిడి కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకొని ఉంటారని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details