అనంతపురం జిల్లాలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. పామిడి మండలం రామరాజుపల్లిలో ఆర్థిక, కుటుంబ సమస్యలతో బయపురెడ్డి, అనసూయ దంపతులు పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. భార్య అనసూయ పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మృతి చెందింది. భర్త బయపురెడ్డి మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలిస్తుండగా మృతి చెందాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
పురుగుల మందు తాగి దంపతులు బలవన్మరణం - అనంతపురం జిల్లా నేర వార్తలు
అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజుపల్లిలో విషాదం జరిగింది. ఆర్థిక, కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు.
couple committed suicide in Ramarajupally, Anantapur District