ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య

అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్‌.ఆర్‌.పాలెంలో చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

couple commit suicide by hanging at madakasira
couple commit suicide by hanging at madakasira

By

Published : Jun 2, 2021, 11:54 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం హెచ్‌.ఆర్‌.పాలెంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్‌.ఆర్‌.పాలెంలో చెట్టుకు ఉరేసుకుని.. యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మడకశిరలోని శివాపురం ప్రాంతానికి చెందిన వీరిద్దరూ.. గతంలో ప్రేమించుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆ తర్వాత ఇద్దరికి వేర్వేరుగా వివాహాలయ్యాయి. అయినా పాత సంబంధం అలాగే కొనసాగించారని... ఈ విషయం తెలిసి పెద్దలు మందలించిన కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్సై శేషగిరి బృందం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details