ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలంలో బంగారు నాణేలు దొరికాయని.. ఎంత పని చేశారంటే..! - అనంతపురం జిల్లా ప్రధాన వార్తలు

బంగారు నాణేలను తక్కువ ధరకు ఇస్తామంటూ నమ్మబలికి.. మోసం చేసే ఇద్దరు వ్యక్తులను అనంతపురం ఇటుకులపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 15 లక్కీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
నకిలీ బంగారు నాణేలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

By

Published : Sep 21, 2021, 7:06 PM IST

అనంతపురానికి చెందిన ప్రకాష్, కూడేరు ప్రాంతానికి చెందిన మహేష్, ఇద్దరు మిత్రులు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మోసాలకు పాల్పడడం మొదలుపెట్టారు. తమ పొలంలో గుంతలు తవ్వుతుండగా బంగారు నాణాలు దొరికాయని.. వాటిని తక్కువ ధరకే ఇస్తామని ప్రజలకు నమ్మబలికారు. ఇలా ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శిరీష్ రెడ్డి అనే వ్యక్తికి నకిలీ బంగారం నాణేలను రూ.4 లక్షలకు విక్రయించారు.

నకిలీ బంగారు నాణేలు అని తెలుసుకున్న శిరీష్​రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇవాళ ఇటుకలపల్లిలో ఇద్దరిని పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మాయమాటలు చెప్పే వాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు కోరారు.

ఇదీ చదవండి:

చీకటి రాజకీయాలు ఎవరివో అందరికీ తెలుసు: ఎంపీ భరత్‌

ABOUT THE AUTHOR

...view details