అంబులెన్సు సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ కరోనా బాధితుడు పడిగాపులు కాయాల్సి వచ్చింది. సమాచారం ఇచ్చి గంటలు గడిచినా అంబులెన్సు రాకపోవటంతో అతను తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కూడేరులో జరిగింది.
కూడేరుకు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అతనికి స్థానిక ఏఎన్ఎం ఒకరు సమాచారం ఇచ్చారు. అనంతరం విషయాన్ని ఆమె ఉన్నతాధికారులకు తెలిపింది. బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు వారు బుధవారం ఉదయం 11 గంటలకు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. సాయంత్రం అయినా అంబులెన్స్ అక్కడికి రాలేదు. కరోనా సోకిన వ్యక్తి వాహనం కోసం ఎదురుచూస్తూ కూడేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఓ చెట్టు కిందే ఉండిపోయాడు. అతని ఆరోగ్యం క్షీణించకముందే ఆసుపత్రికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.