అనంతపురం జిల్లాలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో కొవిడ్ టెస్టుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాతూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో ఎక్కువశాతం 55 నుంచి 65 ఏళ్ల లోపు వృద్ధులే ఉన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ఆసక్తి చూపారు.
అనంతలో కరోనా పరీక్షలకు ప్రత్యేక కేంద్రాలు.. తరలి వచ్చిన వృద్ధులు - అనంతపురం జిల్లాలో కరోనా పరీక్షలు తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో కొవిడ్ పరీక్షలు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా వారిలో ఎక్కువ మంది 55 ఎళ్లకు పైబడిన వారు కావడం విశేషం. అయితే వీరంతా ఎండను సైతం లెక్క చేయకుండా పరీక్షలు కోసం నిరీక్షించారు.
కరోనా పరీక్షలకు ప్రత్యేక కేంద్రాలు