అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ జైల్లో కరోనా కలకలం రేపుతోంది. ధర్మవరం నుంచి ఒక హత్య కేసులో నిందితులుగా వచ్చిన ఇద్దరు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు అప్రమత్తమై వెంటనే సబ్ జైలులో రసాయనాలు పిచికారి చేయించి వారిని అనంతపురంలోని ఎస్కేయూ కరోనా ఆసుపత్రికి తరలించారు. సబ్ జైల్లో రసాయనాలు పిచికారి చేయించామని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైలు పర్యవేక్షకులు హర్షవర్ధన్ తెలిపారు.
పెనుకొండ సబ్ జైల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్
అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ జైల్లో ఇద్దరు రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారిద్దరిని అధికారులు జిల్లాలోని ఎస్కేయూ కరోనా ఆసుపత్రికి తరలించారు.
corona postive in penukonda sub jail at anantapur dst