ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌! - ఏపీలో కరోనా వార్తలు

అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్​కు కరోనా సోకినట్లు ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ప్రకటించారు. మరోవైపు తహసీల్దార్ డ్రైవర్, అటెండర్, కార్యాలయ సిబ్బంది చిరునామాలను అధికారులు సేకరించారు. సిబ్బందిని క్వారంటైన్​కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

corona positive for tahsildar in anantapur district
corona positive for tahsildar in anantapur district

By

Published : Apr 15, 2020, 12:36 AM IST

Updated : Apr 15, 2020, 2:57 AM IST

రాష్ట్రంలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్‌కు కరోనా సోకినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు. హిందూపురంలో నివసిస్తున్న తహసీల్దార్‌.. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకాలేదు. దీంతో నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్లు నిర్ధారించారు. అనంతరం తహసీల్దార్‌ను అనంతపురంలోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు తహసీల్దార్‌ డ్రైవర్‌, అటెండర్‌, కార్యాలయ సిబ్బంది చిరునామాలను అధికారులు సేకరించారు. సిబ్బందిని వెంటనే క్వారంటైన్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.

Last Updated : Apr 15, 2020, 2:57 AM IST

ABOUT THE AUTHOR

...view details