అనంతపురం జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయని కొవిడ్ జిల్లా నోడల్ అధికారి జగన్నాథసింగ్ తెలిపారు. హిందూపురంలో కొంత మేర పాజిటివ్ కేసులు తగ్గినా.. అనంతపురం నగరంలో మాత్రం బాధితుల సంఖ్య పెరుగుతుందని వెల్లడించారు. నగరంలో 20కి పైగా హైరిస్క్ ప్రాంతాలను ప్రకటించినట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 5,483 మందికి కరోనా సోకగా.. 2,340 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. 74 మంది కరోనాతో మరణించినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో 410 కంటైన్మంట్ జోన్లు ప్రకటించామనీ.. వీటిలో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అనంతపురంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు - అనంతపురం కరోనా కేసులు న్యూస్
అనంతపురంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది కరోనాతో మరణించినట్లు స్పష్టం చేశారు.
అనంతపురంలో పెరుగుతన్న కరోనా పాజిటివ్ కేసులు