అనంతపురం జిల్లా గుంతకల్లులో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా పురపాలక అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. శ్రామిక రైళ్ల ద్వారా పట్టణ వాసులు వస్తున్నందున.. అధికారులు వారిని గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారు నివసిస్తున్న ప్రాంతాలను ప్రత్యేక జోన్‌గా ప్రకటించి స్థానికులను గృహ నిర్బంధంలో ఉండేలా చూస్తున్నామని కమిషనర్ అన్నారు.
గుంతకల్లులో విస్తరిస్తోన్న కరోనా..ప్రత్యేక చర్యలు చేపడుతున్న అధికారులు - ananthapuram district news updates
అనంతపురం జిల్లా గుంతకల్లులో కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొవిడ్ నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో పాటు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
గుంతకల్లులో విస్తరిస్తోన్న కరోనా
బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్కులు ధరించడం... భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ప్రస్తుతం పట్టణానికి చెందిన తొమ్మిది మంది జిల్లా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. ఇద్దరు కోలుకుని ఇళ్లకు వెళ్లారని తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని చెప్పారు.
ఇదీచదవండి.