అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గంటల వ్యవధిలోనే ఇద్దరు నుంచి ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గుత్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. మృతదేహం పక్కనే బాధితులకు చికిత్స అందిస్తుండటంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ అంశంపై వైద్యాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.
పడకల కొరతతో కరోనా బాధితుల ఇబ్బందులు - ananthapuram hospital latest news
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పడకలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గత్యంతరం లేక వెదురు పడకలు, నేలపై, కుర్చీలోనే చికిత్స పొందుతున్నారు.
![పడకల కొరతతో కరోనా బాధితుల ఇబ్బందులు corona patients problems in ananthapuram govt hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11760507-135-11760507-1620998234960.jpg)
అనంతపురం ప్రభుత్వాస్పత్రి