అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో లాక్డౌన్ కొనసాగుతోందని డీఎస్పీ వెంకటరమణ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ఆయన పట్టణంలో లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. సోమవారం నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు... అన్ని దుకాణాలు తెరుస్తున్నట్లు జోరుగా తప్పుడు ప్రచారం సాగుతుందన్నారు. ఈ విషయమై లిఖితపూర్వకంగా ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. ఎప్పటిలాగే లాక్డౌన్ని కఠినంగా అమలు చేస్తామని... ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
అనంతలో లాక్డౌన్ యధాతథం - ananthapuram lockdown news
అనంతపురం జిల్లాలో లాక్డౌన్ ఎత్తివేస్తారని వస్తున్న ఊహాగానాలకు డీఎస్పీ వెంకటరమణ తెరదించారు. తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ని అమలుచేస్తామని వివరించారు.
corona lockdown continuing in ananthapuram