అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో సంజీవి వాహనం ద్వారా కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు ప్రారంభించారు. ప్రతిరోజు 60 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న చాలా మంది నిర్ధరణ పరీక్షల కోసం వందల సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రికి బారులు తీరారు. తమ పేర్లు నమోదు చేయించుకునేందుకు వచ్చిన వారంతా క్యూ లైన్లలో సామాజిక దూరం పాటించకుండా నిల్చున్నారు. మరి కొందరు మాస్కులు కూడా లేకుండా వచ్చారు. వీరిలో ఏ ఒక్కరికైనా కరోనా లక్షణాలుంటే అందరూ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
పరీక్షలకు వస్తే కరోనా వచ్చేలా ఉంది
అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సంజీవని వాహనం ద్వారా రోజుకు 60 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ అనుమానిత లక్షణాలున్న వారు నిర్ధరణ పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. చాలా మంది భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో పరీక్షలకని వస్తే కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు.
పరీక్షలకు వస్తే కరోనా వచ్చేలా ఉంది
క్యూ లైన్ల పరిస్థితి చూసి కొందరు పరీక్షలు లేకపోయినా ఫర్వాలేదని వెనుదిరిగుతున్నారు. పోలీసులు, వైద్య సిబ్బంది క్యూ లైన్లలో ఉండే వారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చదవండి: మడకశిరలో ఎస్బీఐ సిబ్బందికి కరోనా లక్షణాలు..మూతపడిన బ్యాంక్