ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పల్లెల్లో కరోనా కేసులు ... భయాందోళనలో ప్రజలు - అనంతపురం కొవిడ్ కేసులు

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తోంది. రెండు రోజుల్లో 12 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

anantapur district corona cases
anantapur district corona cases

By

Published : Jul 24, 2020, 9:04 AM IST

అనంతపురం జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ మహమ్మారి వైరస్ గ్రామాలకు విస్తరిస్తోంది. మడకశిర నియోజకవర్గంలోని మూడు మండలాల్లో గత రెండు రోజుల్లో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అమరాపురం మండలంలో 4, గుడిబండ మండలంలో 5, మడకశిర మండలంలో 3 ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అధికంగా కేసులు నమోదు కావటంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా బాధితులను అధికారులు ఆస్పత్రికి తరలించారు. బాధితులతో కాంటాక్ట్ అయిన వ్యక్తులను క్వారంటైన్​కు తరలించారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అక్కడి ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details