అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. తన అంగరక్షకులలో ముగ్గురికి, తన కార్యాలయంలో పనిచేస్తున్న మరో ముగ్గురికి కరోనా సోకిందని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే కేతిరెడ్డి అంగరక్షకుడు కరోనాతో మృతి చెందాడు. దీంతో ఎమ్మెల్యేతో అంగరక్షకులు, అనుచరులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఎమ్మెల్యే అంగరక్షకుడి నుంచి ఆరుగురికి కరోనా..! - corona to dhrmavaram mla body gauurd
అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అంగరక్షకుల్లో ముగ్గురికి, అనుచరుల్లో మరో ముగ్గురికి కరోనా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల కిందట ఎమ్మెల్యే అంగరక్షకుడు కరోనాతో మృతి చెందడంతో కార్యాలయంలో వారందరికీ కోవిడ్-19 పరీక్షలు చేశారు.
ఎమ్మెల్యే అంగరక్షకుడి నుంచి ఆరుగురికి కరోనా
ఎమ్మెల్యేకు నెగెటివ్ రాగా.. అతని అంగరక్షకుల్లో ముగ్గురికి, కార్యాలయంలో పనిచేసే మరో ముగ్గురికి మహమ్మారి సోకిందని నిర్ధరణ అయ్యింది. కరోనా వల్ల అంగరక్షకుడు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: వైకాపా కండువా కప్పుకుంటే కోట్లు... లేదంటే కేసులు'
Last Updated : Jun 14, 2020, 6:30 PM IST