అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పడ్డాయి. బ్యాంకులు, కార్యాలయాలు మినహా..పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది. ఈ నేపథ్యంలో మడకశిర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ సిబ్బందిలో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా..ఒకరికి అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. దీంతో బ్యాంకులో పని చేస్తున్న మిగిలిన సిబ్బంది కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో బ్రాంచ్ తాత్కాలికంగా మూతపడింది. మరోవైపు గ్రామీణ ప్రాంత ప్రజలు పంట రుణాల నవీకరణ కోసం ఎదురుచూస్తున్నారు.
మడకశిరలో ఎస్బీఐ సిబ్బందికి కరోనా లక్షణాలు..మూతపడిన బ్యాంక్ - Corona features for bank staff instated bank
మడకశిర నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. బ్యాంక్ సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు మూతపడింది.
బ్యాంక్ సిబ్బందికి కరోనా లక్షణాలు..మూతపడిన బ్యాంక్