కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్రభుత్వం విధించిన నిబంధనలు అటకెక్కుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్, బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించకుండా..ప్రజలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు.
మీ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
లాక్డౌన్లో సడలింపులు చేశారు. మళ్లీ యథావిధిగా దుకాణాలు తెరుచుకున్నాయి. రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వాలు కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోజు రోజుకూ కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఇలా కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
corona effect in ananthapuram
ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు భౌతిక దూరం పాటించకుండా బస్సులు ఎక్కేందుకు ఎగబడుతున్నారు. బ్యాంకులకు వివిధ పనుల నిమిత్తం వస్తున్న ఖాతాదారులు నిబంధనలు అతిక్రమిస్తున్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా బారిన పడతారని పలువురు హెచ్చరిస్తున్నారు.