ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో కరోనా అనుమానితుడు: ఆసుపత్రికి తరలింపు - ap corona latest news

కళ్యాణదుర్గంలోని మంజునాథ థియేటర్​ వద్ద నివాసముంటున్న ఓ వ్యక్తి తీవ్ర జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. గతవారం ఓ పని మీద వైజాగ్​ వెళ్లి వచ్చినప్పటి నుంచి ఇలా జరిగిందని సమాచారం. స్థానిక వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి బాధితుడిని అనంతపురం ఆసుపత్రికి పంపారు.

corona doubt case in ananthapuram district
కళ్యాణదుర్గంలో కరోనా అనుమానితుడు.. అనంతపురం ఆసుపత్రికి తరలింపు

By

Published : Mar 21, 2020, 5:47 PM IST

అనంతపురంలో కరోనా అనుమానితుడు: ఆసుపత్రికి తరలింపు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంజునాథ థియేటర్​ వద్ద నివాసముంటున్న ఓ వ్యక్తికి జలుబు, జ్వరం ఉండటం వల్ల స్థానికంగా కొంత ఆందోళన నెలకొంది. వారం కిందట ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వైజాగ్​ వెళ్లినట్లు సమాచారం. అక్కడినుంచి వచ్చినప్పటి నుంచి జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటం వల్ల ఆయనే పరీక్షల కోసం వచ్చినట్లు తెలిసింది. ఈయన్ను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించిన తరువాత అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించామని... కరోనా ఉందని తాము స్పష్టం చేయలేదని వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details