అనంతపురం జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ... మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మంగళవారం విడుదల చేసిన బులెటిన్ లో 959 మందికి కొత్తగా వైరస్ సోకింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న 6433 మందిలో 13 మంది మృత్యువాత పడ్డారు. మార్చి నుంచి నేటి వరకు కొవిడ్ కోరల్లో చిక్కి 188 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య కూడా ఇప్పటి వరకు 25వేల 700 కు చేరుకుంది.
మృతి చెందుతున్న వారిలో ఎక్కువ మంది ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నవారే కావటంతో ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు అనివార్యంగా మారింది. ఆసుపత్రికి రోగులు రాగానే, తొలుత ఆక్సిజన్ అమర్చాలని, ఆ తరువాతే రోగికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలని అధికారులు వైద్యులకు ఆదేశాలిచ్చారు.