ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటిలో పెరుగుతున్న కరోనా కేసులు

కడప జిల్లా రాయచోటిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 6 పాజిటివ్ కేసులు నమోదవటం పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అధికారులు ఆయా ప్రాంతాల్లో పారిశుద్ద్య చర్యలు చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనలు పాటించాలని సూచించారు.

corona cases in kadapa dst rayacoti are increasing
corona cases in kadapa dst rayacoti are increasing

By

Published : Jul 13, 2020, 9:04 AM IST

కడప జిల్లా రాయచోటిలో రెండు రోజుల్లో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పట్టణ పరిధిలోని నారాయణ రెడ్డి ఆసుపత్రి వీధి, మాసాపేట కొత్తపల్లి ఎస్​ఎన్ కాలనీలలో ఒక మహిళతో పాటు ముగ్గురు యువకులకు పాజిటివ్ రాగా గ్రామీణ పరిధిలోని పెమ్మాడ పల్లెలో నిండు గర్భిణీకి వైరస్​ పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలంలో మరో మూడు పాజిటివ్ కేసులు వచ్చాయి. రాయచోటి పురపాలక పోలీసు రెవెన్యూ అధికారులు కరోనా బాధితులను ప్రత్యేక వాహనాల్లో కడప ఫాతిమా మెడికల్ కళాశాలకు తరలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. కంసాలి వీధి, గాంధీ బజార్, కొత్తపల్లి, ఎస్​ఎన్ కాలనీ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు.

రాయచోటిలోని క్వారంటైన్​లో ఉన్న 180 మంది ప్రవాసాంధ్రుల్లో ఒకరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందని నియోజకవర్గ నోడల్ అధికారి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు నిబంధనలు పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి..

ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చ: భారతీయ రైల్వేల ప్రైవేటీకరణ

ABOUT THE AUTHOR

...view details