అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 976 మందికి వైరస్ సోకగా...11 మంది మృత్యువాత పడ్డారు. నగరంలోని పాతూరులో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలు దాటిపోయాయి. ఏడు వేల మంది వరకు ఆసుపత్రుల్లో, హోం ఐసోలేషన్ లో ఉంటూ వైద్యం తీసుకుంటున్నారు. మార్చి 29న అనంతపురంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు కాగా... ఇప్పటి వరకు 162 మంది మృత్యువాత పడ్డారు. 765 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపగా... వైరస్ నుంచి కోలుకొని ఇంటిటి వెళ్లిన వారు 16వేల మంది వరకు ఉన్నారు. వైరస్ ఉద్ధృతి పెరుగుతుండటంతో అనంతపురం నగరంలో పది ప్రైవేట్ నర్సింగ్ హోంలను కోవిడ్ ఆసుపత్రులుగా ప్రకటించారు. మరో వారం రోజుల్లో నగరంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు చికిత్సలు ప్రారంభించటానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో విజృంభిస్తోన్న కరోనా
అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 976 మందికి వైరస్ సోకగా...11 మంది మృత్యువాత పడ్డారు.
అనంతపురం జిల్లాలో కరోనా
ఇదీ చూడండి.సదుపాయాలు లేవని కరోనా బాధితుల ఆందోళన