అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో 1,112 మంది వైరస్ బారిన పడినట్లు పేర్కొన్నారు. 10 మంది కొవిడ్‌తో మృతిచెందారు. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 6,768కు చేరింది. మహమ్మారితో ఇప్పటివరకు 142 మంది మరణించారు. జిల్లాలో కొత్తగా వైరస్ సోకుతున్న వారిలో సగానికి పైగా అనంతపురం నగర ప్రజలే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ధర్మవరం, తాడిపత్రి, కదిరి, ఉరవకొండ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
జిల్లాలో కొత్తగా 1,112 కరోనా కేసులు.. 10 మంది మృతి - అనంతపురం జిల్లాలో కరోనా కేసులు
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గురువారం ఒక్కరోజే 1,112 మందికి పాజిటివ్ నమోదవగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
అనంతపురం జిల్లా కరోనా కేసులు