కరోనా మహమ్మారి అనంతపురం జిల్లా మడకశిర పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతానికి విస్తరించింది. మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలోని ఓ వ్యక్తికి కరోనా నిర్ధరణ కావడంతో అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇప్పటివరకు మడకశిర పట్టణానికే పరిమితమైన కరోనా.. మొదటిసారిగా గ్రామీణ ప్రాంతానికి ప్రబలడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
గ్రామాలకు పాకుతున్న మహమ్మారి.. అప్రమత్తమైన అధికారులు - corona updates at madakasira
అన్ లాక్ తర్వాత కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. గ్రామాలకూ వేగంగా పాకుతూ కలవరపెడుతోంది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో మొదటిసారి గౌడనహళ్లి గ్రామంలో కరోనా కేసు నమోదైంది.
మడకశిరలో కరోనా కేసులు
కరోనా వైరస్ నివారణకు గౌడనహళ్లి గ్రామంలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా గ్రామంలోని ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రైతులు ఇతరులను కలవకుండా వారి పొలం పనులను యథావిధిగా కొనసాగించవచ్చని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు