కరోనా విజృంభించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని... ఆహార భద్రతా శాఖ అధికారులు, హోటల్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ వాడాలని సూచించారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొత్త కరోనా వైరస్ స్ట్రైన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరస్ సోకకుండా ఉండేందుకు "మాస్కే కవచం" అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించారు.
కొత్త కరోనా వైరస్ స్ట్రైయిన్ పై అవగాహన ర్యాలీ - ఆహార భద్రతా శాఖ అధికారులు
నూతన కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని... ఆహార భద్రతా శాఖ అధికారులు, హోటల్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో అనంతపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్ ఉపయోగించాలన్నారు.
కొత్త కరోనా వైరస్ స్ట్రైన్ పై అవగాహన ర్యాలీ