అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఎస్పీ రమాకాంత్.. సిబ్బందితో కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఇప్పటికే పదహారు వందల మంది కరోనా బారిన పడ్డారని కమిషనర్ తెలిపారు.
వీధుల్లో జనం రద్దీ వల్ల కరోనా మరింత ప్రబలే ప్రమాదం ఉందని.. పది రోజుల పాటు వీధి వ్యాపారులు బంద్ చేయాలని డీఎస్పీ రమాకాంత్ కోరారు. ఉపాధి కోల్పోకుండా వీధుల్లో నేరుగా ఇళ్ల వద్దకు వెళ్లి విక్రయించాలని చెప్పారు. భౌతిక దూరం పాటించకుండా కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే.. దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.