ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కులు లేనివారికి జరిమానా.. అనర్థాలపై పోలీసుల అవగాహన - sp satya yesubabu latest news

అనంతపురం జిల్లాలో పోలీసులు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు రోజూ జిల్లా వ్యాప్తంగా చేపడతామన్నారు. మాస్క్​లు ధరించని వారిని గుర్తించి జరిమానాలు విధించారు.

corona awareness program
కరోనా నియంత్రణ అవగాహన కార్యక్రమం

By

Published : Mar 31, 2021, 4:46 PM IST

అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం కరోనా వ్యాప్తి నియంత్రణ అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించారు. హిందూపురంలో ఎస్పీ సత్య ఏసుబాబు... అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గాంధీ కూడలి వద్ద మాస్క్​లు లేకుండా తిరుగుతున్న వాహనచోదకులను, పాద చారులను ఆపి... అనర్థాలను తెలియజేశారు. మాస్క్​లు పంచారు. ఈ అవగాహన కార్యక్రమాలను రోజూ జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తామని తెలిపారు. హిందూపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details