ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రగిరిని కలవరపెడుతున్న కరోనా కేసులు - చంద్రగిరిలో కరోనా పాజిటివ్ కేసులు

అనంతపురం జిల్లా చంద్రగిరి ప్రజలను కరోనా వైరస్ వణికిస్తోంది. లాక్​డౌన్ సడలింపుతో నగరంపై కొవిడ్ పంజా విసురుతోంది. చంద్రగిరి వైరస్​కు హాట్​స్పాట్​గా మారబోతుందోమోనని అధికారులు భయాందోళనకు గురవుతున్నారు.

corona positive cases raises in chandragiri
చంద్రగిరిలో కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Jun 11, 2020, 1:49 PM IST

ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిని కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. మూడు రోజుల క్రితం ముంబై నుంచి వచ్చిన ఓ యువకుడు కరోనా వైరస్ సోకి ఆసుపత్రి పాలయ్యాడు. ముంగిలిపట్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు ఆదే గ్రామానికి చెందిన మరో వృద్ధుడుకి సైతం వైరస్ సోకి రుయా ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

తాజాగా చంద్రగిరి, ముస్లిం పేటకు చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు కరోనా వైరస్ బారిన పడ్డారు. మార్చి17 వ తేదీన ఓ వ్యక్తి ఏడుగురు కుటుంబ సభ్యులతో కలసి ముంబైలోని అత్తగారింటికి వెళ్లాడు. లాక్​డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు. లాక్​డౌన్ సడలింపులతో వారం క్రితం ముంబై నుంచి అనంతపురానికి ట్రైన్​లో... అక్కడ నుంచి క్యాబ్​లో చంద్రగిరికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆ కుటుంబంలోని ఇద్దరి శాపిల్స్ తీసి పరీక్షలకు పంపారు. రిపోర్ట్స్​లో కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. దీంతో వారిని రుయాలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మిగిలిన ఆరుగురిని క్వారంటైన్​కు పంపించారు. మొదట ఈ ఆరుగురు వైద్య పరీక్షలకు సహకరించలేదని అధికారులు తెలిపారు. మొత్తం 7 పాజిటివ్ కేసులు యాక్టివ్ లో ఉండడంతో చంద్రగిరి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అధికారులు శానిటేషన్, పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:రాయదుర్గం సచివాలయ ఉద్యోగి సస్పెండ్

ABOUT THE AUTHOR

...view details