ప్రజలందరూ ఐకమత్యంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కృషి చేయాలని అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన చిత్రకారుడు చక్రి పిలుపునిచ్చారు. ప్రధాన రహదారిపై వైరస్ చిత్రాన్ని గీసి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ చిత్రం గీసేందుకు తానే సొంతంగా రూ.2 వేలు ఖర్చు చేశానని ఆయన పేర్కొన్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు రోడ్డుపైన కనిపించినా కరోనా వైరస్ చిత్రాన్ని చూసిన ప్రజలు బయటకు రాకుండా ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కరోనా చిత్రం చెప్పిన కథ - anantapur dst corona news
అనంతపురం జిల్లాకు చెందిన చిత్రకళాకారుడు కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రోడ్లపై చిత్రాని గీశాడు. బయటకు వచ్చినప్పుడు ఈ చిత్రాన్ని చూసి అయినా ప్రజల్లో చైతన్యం కలిగి ఇకపై ఎవరూ రాకూడదనే తన ఉద్దేశం అని తెలిపాడు.
రోడ్డుపై కరోనా చిత్రం గీసి ప్రజల్లో అవగాహన