ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో పోలీసుల కార్డెన్​ సెర్చ్​.. - ఓటు హక్కుపై అవగాహన తాజా వార్తలు

మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా కదిరిలో కార్డెన్​ సెర్చ్​ నిర్వహించారు. పోలీసులు, సెబ్​ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఎవరైన చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

cordon search in kadiri
కదిరిలో పోలీసుల కార్డెన్​ సెర్చ్​..

By

Published : Mar 4, 2021, 2:44 PM IST

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో పోలీసులు, సెబ్ విభాగం పోలీసులు సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్, వార్డు మీటింగ్ నిర్వహించారు. కదిరి డీఎస్పీ భవ్య కిషోర్, సీఐ రామకృష్ణ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లు, హింసకు తావు లేకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, డబ్బు పంపిణీ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఓటు హక్కుపై అవగాహన..

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రజలతో సమావేశమై ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలన్నారు.

ఇదీ చదవండి:రెండేళ్ల హిందూపురం అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details