తాడిపత్రి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. మూడు స్థానాలను తెదేపా వర్గీయులు కైవసం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ మైనారిటీ కో-ఆప్షన్ సభ్యులు, పాలనా అనుభవం కలిగిన ముగ్గురు సభ్యుల ఎన్నిక సందర్భంగా శుక్రవారం తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ లో 36 మంది వార్డు కౌన్సిల్ సభ్యులు ఉండగా.. వారిలో 18 మంది తెదేపా, 16 మంది వైకాపా, ఒకరు సీపీఐ, ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో మైనార్టీ కోటా కో- ఆప్షన్ సభ్యులు ఎన్నికలో తెదేపాకు చెందిన కుమ్మెత్త షెమీమ్, ముస్తాక్ అహ్మద్ లు నూతనంగా ఎన్నికయ్యారు. పాలనానుభవం కోటాకు జరిగిన ఎన్నికల్లో తెదేపాకు చెందిన బింగి ప్రభాకర్ ను ఎన్నుకున్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సుఖాంతం - తాడిపత్రి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రశాంతంగా ముగిశాయి. కో-ఆప్షన్ సభ్యులు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పురపాలిక కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సుఖాంతం